థానే: మహారాష్ట్రలోని థానే జిల్లా(Thane district)లో స్కూటర్‌పై పిలియన్ నడుపుతున్న 61 ఏళ్ల మహిళ వాహనంపై నుంచి గుంతలో పడి మృతి చెందినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. శుక్రవారం రాత్రి డోంబివిలి టౌన్‌షిప్(Dombivli Township)లో ఈ ఘటన చోటుచేసుకుందని, ఆ ప్రాంతంలోని లోధా పలావాలో నివాసం ఉంటున్న భారతి విజయ్‌కుమార్ భోయ్ తన కొడుకుతో కలిసి ద్విచక్ర వాహనంపై మార్కెట్‌కు వెళ్తుండగా.. రాత్రి 9.40 గంటల ప్రాంతంలో స్కూటర్ అదుపుతప్పి ఓ గుంతను ఢీకొట్టడంతో మహిళ బ్యాలెన్స్ తప్పి కిందపడింది. ఆమె తలకు బలమైన గాయాలు తగిలాయి. ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె చనిపోయినట్లు ప్రకటించారని డోంబివిలిలోని మాన్పాడ పోలీస్ స్టేషన్(Manpada Police Station) నుండి అధికారి తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.