బైక్‌పై నుంచి పడి మహిళ మృతి
బెల్లంపల్లి, డిసెంబర్ 6 (విజయక్రాంతి): బైక్‌పై నుంచి పడి మహిళ మృతి చెందిన ఘటన కాసిపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. దేవాపూర్‌కు చెందిన సుఖేందర్‌సింగ్ శుక్ర వారం తన భార్య కుసుమాదేవి, మూడేళ్ల కూతురుతో కలిసి మంచిర్యాలకు బైక్‌పై వెళ్తున్నాడు. కాసిపేట చర్చీ సమీపంలోని స్పీడ్‌బ్రేకర్ వద్ద కు రాగానే ప్రమాదవశాత్తు కుసుమాదేవి బైక్‌పై నుంచి కిందపడి తీ వ్రంగా గాయపడింది. తలకు బలమైన గాయాలు తగలడంతో వెంట నే కాసిపేట పీహెచ్‌సీకి, అక్కడి నుం చి బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.