calender_icon.png 8 April, 2025 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమను ఒప్పుకోలేదని మనస్థాపంతో పురుగుల మందు తాగి మహిళ మృతి

06-04-2025 07:02:43 PM

చేగుంట (విజయక్రాంతి): తల్లిదండ్రులు ప్రేమను ఒప్పుకోలేదని మనస్థాపంతో పురుగుల మందు తాగి మృతి చెందిన సంఘటన చేగుంట మండల పరిధిలోని బోనాల గ్రామంలో చోటుచేసుకుంది. వరలక్ష్మి(18) గత రెండు సంవత్సరాల నుండి బోనాల గ్రామానికి చెందిన వ్యక్తితో ప్రేమలో ఉంది. ఇట్టి ప్రేమను వరుస కాదని వరలక్ష్మి తల్లిదండ్రులు, అక్క బావలు రెండు నెలల క్రితం మందలించారు. తన ప్రేమను ఒప్పుకుంటలేరని మనస్థాపం చెందిన వరలక్ష్మి.. ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగింది.

ఇంటిపక్క వారు చూసి కుటుంబీకులకు సమాచారం ఇవ్వగా వెంటనే వారు వచ్చి వరలక్ష్మిని నార్సింగ్ చారి ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన వైద్య నిమిత్తము మేడ్చల్ లోని సంప్రదా హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.