ఆదిలాబాద్, జనవరి 01 (విజయ క్రాంతి): అడవిపందుల నుంచి పంట చేను రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి మహిళ మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇచ్చోడ మండలం మల్యాల గ్రామానికి చెందిన రాజుబాయి (65) గత నెల ౩౧న వ్యవసాయ పనుల కోసం వెళ్లింది.
అక్కడ అడవి పందుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగలడంతో దుర్మరణం చెందింది. రాజుబాయి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుటుంబీకులు బుధవారం పొలం వద్ద వెతకగా పొలంలో మృ తదేహం లభ్యమైంది.