calender_icon.png 28 March, 2025 | 7:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేటు బస్సు ఢీకొని మహిళా మృతి

25-03-2025 11:32:12 AM

చేగుంట,(విజయక్రాంతి): మాసాయిపేట్ (మం) స్టేషన్ మాసాయిపేట్ గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆరెంజ్ ట్రావెల్ బస్సు ఢీకొని ఓ మహిళ మృతి, మృతురాలు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కొట్టాల గ్రామానికి చెందిన సాయవ్వ(45) గా గుర్తింపు రైలు దిగి 44వ జాతీయ రహదారిపై ఉదయం ఏడు గంటలకు నడుచుకుంటూ వెళ్తున్నతుండగా కామారెడ్డి నుండి హైదరాబాద్ కు వెళ్తున్న ఆరెంజ్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు మహిళను ఢీకొట్టడంతో  మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న రామయంపేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రాజా గౌడ్  సంఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ ట్రావెల్  బస్సును తూప్రాన్ పోలీస్ తరితలించారు, చేగుంట పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.