06-03-2025 12:27:42 AM
కామారెడ్డి, మార్చ్ 5 (విజయక్రాంతి): కారు ఢీకొని మహిళా మృతి చెందిన ఘటన కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో బుధవారం సాయంత్రం ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
చిన్న మల్లారెడ్డి గ్రామంలో ఒక కారు డ్రైవర్ టిఎస్ 17 ఎల్ 4142 గల దాని డ్రైవరు అతివేగంగా అజాగ్రత్తగా నడిపి చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన నేరడి అంజవ్వ (55 ) నడుచుకుంటా రోడ్డు మీద వెళ్తున్న ఆమెను వెనకనుంచి ఢీకొట్టగా ఆమె తలకి బలమైన గాయాలు అయ్యాయి. బలమైన గాయాలు కావడం వల్ల అక్కడికక్కడే మృతి చెందింది. ఇట్టి విషయమై దేవునిపల్లి పోలీసులకు సమాచారం రాగా మృతురాలికి పంచనామా నిర్వహించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.