మంథని : ఓ మహిళను హత్య చేసి ముటకట్టి బావిలో పడేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ముత్తారం-పారుపల్లికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన గుర్రాల వాగు వద్ద వ్యవసాయ బావిలో జూలై 8వ తేదీన మహిళ మృతదేహం లభ్యంచింది. దీంతో ఆ మృతదేహం గుర్తించేందుకు మంథని సీఐ వెంకటేశ్వర్లు, ముత్తారం ఎస్ఐ మధుసూదన్ రావు వారి కోణంలో విచారణ చేశారు.
ముత్తారం మండల కేంద్రంలోని కాసర్ల గడ్డకు చెందిన పెరుక రాజేశ్వరిగా ఆదివారం గుర్తించామని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ముత్తారంకు చెందిన రాపెళ్లి అశోక్ రవి సంజీవులు చిన్నమ్మ పెరుక రాజేశ్వరి కనబడటం లేదని ముత్తారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు విచారణ చేయగా రాజేశ్వరి ముత్తారం మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకుకు వెళ్లి తిరుగు ప్రయాణం చేస్తున్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు.
ఆమె వేసుకున్న దుస్తువుల ఆధారంగా వ్యవసాయ బావిలో ఉన్న మృతదేహం రాజేశ్వరిగా గుర్తించామని, హత్యచేసి శవాని మూటకట్టి బావిలో వేశారని సీఐ పేర్కొన్నారు. సంఘటన స్థలానికి జాగిలాలతో వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశామని, మృతికి గల కారణాలు తెలుసుకొని త్వరలోనే హంతకులను గుర్తించి, కఠినంగా శిక్షిస్తామని సీఐ వెల్లిడించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.