22-04-2025 12:00:00 AM
ఎల్బీనగర్, ఏప్రిల్ 21 : ఆ ర్థిక ఇబ్బందులతో మహిళా కానిస్టేబుల్ ఆ త్మహత్య చేసుకున్న ఘటన సోమవారం నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. హస్తినాపురం డివిజన్ లోని టీచర్స్ కాలనీలో నివాసముంటున్న ఆకుల దీపిక (38) నాగోల్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ గా వి ధులు నిర్వహిస్తున్నారు.
ఆర్థిక ఇ బ్బందుల కారణంగా ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త రవికుమార్ పేర్కొన్నారు. భర్త ఫిర్యాదు మేరకు దీపిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మీర్ పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.