calender_icon.png 22 November, 2024 | 9:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య!

28-09-2024 01:26:21 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27(విజయక్రాంతి): హైడ్రా భయంతో ఓ మహిళ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కూకట్‌పల్లి పీఎస్ పరిధిలో శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి యాదవ బస్తీలో నివాసముంటున్న గుర్రంపల్లి బుచ్చమ్మ (52)కు భర్త శివయ్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురి పెళ్లిళ్లు కాగా, కట్నంగా మూడు ఇండ్లను రాసిచ్చింది.

హైడ్రా ఆధ్వర్యంలో స్థానికంగా నల్ల చెరువు పరిధిలోని పలు ఇండ్లు, షెడ్లను అధికారులు కూల్చేసిన సంగతి తెలిసిందే. అయితే వాటికి ఎదురుగా ఉన్న తన రెండు ఇండ్లు, షెడ్డును అధికారులు కూల్చివేస్తారనే భయంతో బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

హైడ్రా అధికారుల వేధింపుల కారణంగానే బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం  ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.