కామారెడ్డి, అక్టోబర్ ౩౦ (విజయక్రాంతి): కుటుంబ కలహాలతో ఓ మహిళ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రాత్రి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అర్సపల్లికి చెందిన సుజాతకు అదే గ్రామానికి చెందిన రవితో కొన్నేళ్ల క్రితం వివాహం కాగా వారికి ఇద్దరు పిల్లలున్నారు.
సుజాత తరచూ తన భర్తతో గొడవపడుతుండేది. మంగళవారం రాత్రి పక్కింటి వాళ్లతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లి పోయింది. బుధవారం రైల్వే స్టేషన్‌మాస్టర్ సమాచారం మేరకు అర్సపల్లి గేట్ సమీపంలో సుజాత మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.