రైల్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసుల వెల్లడి
కామారెడ్డి,(నిజామాబాద్)(విజయక్రాంతి): కుటుంబ కలహాలతో ఓ మహిళ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజాంబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి కథనం ప్రకారం... నిజామాబాద్ అర్సపల్లికి చెందిన సుజాతను అదే గ్రామానికి చెందిన రవితో కొన్ని సంవత్సరాల క్రితం వివాహము జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే సుజాత తరచుగా తన భర్తతో గొడవ పడేదని తెలిపారు. మంగళవారం సుజాత భర్తతోపాటు పక్కింటి వాళ్ళతో కూడా గొడవ పడింది. అనంతరం ఇంటి నుంచి వెళ్లిపోయిందన్నారు. భర్త ఎంత వెతికిన సుజాత ఆచూకీ దొరకపోవడంతో స్థానిక పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశాడు. బుధవారం రైల్వే స్టేషన్ మాస్టర్ సమాచారం మేరకు అర్సపల్లి గేటు సమీపంలో సుజాత మృతదేహం లభించినట్లు రైల్వే ఎస్సై తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజాంబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు రైల్వే ఎస్సై తెలిపారు. మృతురాలి భర్త రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.