calender_icon.png 30 October, 2024 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్య

01-08-2024 12:05:00 AM

నిర్మల్, జూలై 31(విజయక్రాంతి): గోదావరి నదిలో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నది. బాసర ఎస్సై గణేష్ బుధవారం వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ పట్టణంలోని ధర్మపురి కాలనీకి చెందిన తుమ్మల లక్ష్మి(32) బుధవారం బాసరకు వెళ్లి, గోదావరి బ్రిడ్జి పైనుంచి నదిలో దూకింది. జాలర్లు నదిలో మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని బయటకు తీశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.