calender_icon.png 21 September, 2024 | 3:19 PM

ఉరేసుకొని మహిళ ఆత్మహత్య

21-09-2024 01:39:22 AM

కూకట్‌పల్లి, సెప్టెంబర్ 20: ఉరేసుకొని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్ మల్లాపూర్ గ్రీన్‌హిల్స్ కాలనీకి చెం దిన ఆకుల స్నేహ (34) కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నంబర్ 3లోని ఓ హాస్టల్‌లో ఉంటోం ది. గురువారం రాత్రి తాను ఉంటున్న హాస్టల్ గదిలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం ఉదయం స్నేహ రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో నిర్వాహకులు అనుమానంతో తలుపులు పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో ‘నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని రాసి ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. స్నేహకు గతంలో రెండుసార్లు పెళ్లి జరిగిందని, అవి విఫలమవడంతో తీవ్ర మనోవేదనతో ఆత్మహత్య చేసుకొని ఉంటుందని తండ్రి సత్యనా రాయణ ఫిర్యాదులో పేర్కొన్నారు.