24-04-2025 09:41:21 PM
కొండపాక: మతిస్థిమితం లేని మహిళ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కొండపాక మండలం సిరసనగండ్లలో గురువారం చోటుచేసుకుంది. త్రీ టౌన్ పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. సిరసనగండ్ల గ్రామానికి చెందిన చెంది లక్ష్మి(56) మహిళ కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేకుండా అనారోగ్యంతో బాధపడుతుంది. కొద్దిరోజులకు చనిపోతానని బెదిరించేది. గురువారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిపోయి తిరిగి రానందున కుటుంబ సభ్యులు వెతుకుచుండగా తన వ్యవసాయ భావి దగ్గర చెట్టుకు ఉరి వేసుకొని కనబడింది. వెంటనే ఆమెను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా గమనించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందిందని తెలిపారు. మృతురాలి కొడుకు మహేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్ తెలిపారు.