calender_icon.png 3 April, 2025 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆన్లైన్ షాపింగ్ లో మోసపోయిన మహిళ

01-04-2025 10:54:29 PM

ఫిర్యాదుతో కేసు నమోదు..

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం రుద్రారం గ్రామంలో ఆన్లైన్ షాపింగ్ లో మోసపోయిన ఓ మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం... ఎల్లారెడ్డి మండల పరిధిలోని రుద్రారం గ్రామానికి చెందిన షేర్ల భావన గత నెల 26న ఇంస్టాగ్రామ్ లో ఒక డ్రెస్ చూసి దాన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసిందని, ఈ నేపథ్యంలో గత నెల 30న డ్రెస్ విషయమై ఒక గుర్తుతెలియని వ్యక్తి భావనకు ఫోన్ చేసి మీ డ్రెస్ ను మేము పంపిస్తున్నాము.

కానీ ఆ డ్రస్సుపై అక్కడ టాక్స్ ఉందని మీరు డబ్బులు చెల్లిస్తేనే తిరిగి మీ డబ్బులు మీకు వస్తాయని చెప్పడంతో ఆ విషయం నమ్మి గుర్తు తెలియని వ్యక్తికి మొదటగా 3000 రూపాయలు పంపగా తర్వాత ఆ గుర్తు తెలియని వ్యక్తి మాయమాటలు చెబుతూ 40,118 రూపాయలు కాజేసాడని, తర్వాత ఆ వ్యక్తి మరిన్ని డబ్బులు పంపమని వేధించడంతో మోసపోయానని గ్రహించిన ఆ మహిళ వెంటనే సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేయడంతో 16 వేల రూపాయలు హోల్డ్ లో పడినాయని, అనంతరం ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.