హైదరాబాద్: తిరుమల శ్రీవారి దర్శనం పేరుతో భక్తులను ఓ మహిళ మోసగించింది. హైదరాబాద్ కు చెందిన భక్తుల నుంచి రూ.41 వేలు వసూలు చేసింది. మోసగించిన మహిళను నవ్వశ్రీగా గుర్తించారు. బ్రేక్ దర్శనం, సుప్రభాత సేవ, గదులకు డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు భక్తులు నవ్యశ్రీకి ఫోన్ చేశారు. నవ్యశ్రీ ఫోన్ పనిచేయకపోవడంతో భక్తులు మోసపోయినట్లు గుర్తించారు. దీంతో వెంకటేశ్వర్లు అనే భక్తులు విజిలెన్స్ అధికారులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.