మంథని,విజయక్రాంతి: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని పారుపల్లికి వెళ్లే రోడ్డు పక్కన ఉన్న గుర్రాల వాగు వద్ద ఉన్న దుండ్ర రవికుమార్ అనే రైతు గాజుబావిలో ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ మధుసూధన్ రావు మహిళ మృతి పై విచారణ చేపట్టారు.