01-03-2025 09:50:42 PM
ఐదు తులాల బంగారు నగలు స్వాధీనం
బిచ్కుంద ఎస్ఐ మోహన్ రెడ్డి
కామారెడ్డి,(విజయక్రాంతి): మహిళల మెడల నుంచి బంగారు అభరణాల చోరీ కి పాల్పడుతున్న మహిళను శనివారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద బస్టాండ్ లో పట్టుకొని అరెస్టు చేసినట్లు బిచ్కుంద ఎస్ఐ మోహన్ రెడ్డి తెలిపారు. గత కొద్దిరోజులుగా బిచ్కుంద ఆర్టీసీ బస్టాండ్ లో మహిళల మెడల నుంచి బంగారు నగలు అపహరణకు గురవుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో బస్టాండ్లో నిఘా పెంచినట్లు తెలిపారు. కర్ణాటకలోని ఔరత్ కు చెందిన శాంతాబాయి మధుకర్ కాంబ్లే బిచ్కుంద బస్టాండ్ లో రద్దీగా ఉన్న బస్సులలో ఎక్కుతూ మహిళల మెడల నుంచి బంగారు ఆభరణాలను అపహరిస్తున్నట్లు గుర్తించి పట్టుకొని విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు మహిళ ఒప్పుకోవడమే కాకుండా ఆమె వద్ద ఐదు తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
కర్ణాటక రాష్ట్రంలోని పట్టణంలోని కమల్ నగర్ కు చెందిన శాంతాబాయి బిచ్కుంద బస్టాండ్ లో చోరీలకు పాల్పడుతూ మహిళల మెడలో ఉన్న బంగారు నగలను చోరీ చేసుకుని ఆటో స్టాండ్ కి వెళ్లి అక్కడి నుండి జుక్కల్ చౌరస్తా కు వెళ్లి అక్కడి నుంచే హానేగావ్ మీదుగా ఔరత్ వెళుతుందని విచారణలో వెల్లడైనట్లు ఎస్సై తెలిపారు. బిచ్కుంద బస్టాండ్ లో ఇప్పటివరకు వరుసగా గోడ మీది సాయవ్వ గాండ్ల సాయవ్వ దోమటి శకుంతల సాయవ్వ మెడలో ఉన్న తులం చొప్పున బంగారు గుండ్లను చోరీ చేసి నట్లు ఎస్ఐ తెలిపారు. చోరీలకు పాల్పడిన శాంతాబాయి నుంచి ఐదు తులాల బంగారు గుండ్ల నో స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు ఎస్సై తెలిపారు. చోరీలకు పాల్పడిన మహిళను చాకచక్యంగా పట్టుకున్న కానిస్టేబుల్ నదీమ్ ను అభినందిస్తూ అవార్డు కోసం ఎస్పీకి నివేదించినట్లు ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు.