21-10-2024 01:23:50 AM
న్యూఢిల్లీ: డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్‌గా ఉన్న సమ యంలో బీజేపీ నేత బ్రిజ్‌భూషణ్ సింగ్ తమను లైంగికంగా వేధించాడని మహిళా రెజ్లర్లు పెద్ద పోరాటమే చేశారు. ఆ ఉదంతం అప్పుడు యావత్ క్రీడాలోకాన్ని విస్మయానికి గురి చేసింది. తదనంతర పరిణామాల్లో భాగంగా బ్రిజ్‌భూషణ్ పదవీ చ్యుతుడైన సంగతి కూడా తెలిసిందే. ఆనాడు బ్రిజ్ భూషణ్ మీద లైంగిక ఆరోపణలు చేసిన మహి ళా రెజ్లర్ సాక్షి మాలిక్ తన ఆత్మకథ ‘విట్నెస్’లో కూడా బ్రిజ్‌భూషణ్ మీద ఆరోపణల బాణాలు గుప్పించింది. ‘నాకు అప్పుడు 19 సంవత్సరాలు. 2012లో కజకిస్తాన్‌లో జరిగిన ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్ పోటీల్లో స్వర్ణం సాధించా. ఆ రోజు రాత్రి హోటల్ రూమ్‌లో బ్రిజ్ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ కాలరాత్రిని ఎప్పటికీ మర్చిపోలేను. నేను అతడిని వెనక్కి తోసేసి ఏడ్వడం మొదలుపెట్టా.’ అని తన ఆత్మకథలో వెల్లడించింది.