calender_icon.png 28 September, 2024 | 10:56 AM

పవర్‌ఫుల్ నటనకు సాక్షులుగా ఉండండి

27-09-2024 12:16:56 AM

విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తోంది నటి అభిరామి. ఆమె ఇటీవల హీరో నాని నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్రంలో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న ‘వేట్టయన్’ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రంలోని ఆమె క్యారెక్టర్‌కు సంబంధించి ప్రోమోను మేకర్స్ గురువారం విడుదల చేశారు. ఈ ప్రోమోను సోషల్ మీడియాలో పంచుకుంటూ “వేట్టయన్’లో అభిరామిని శ్వేతగా పరిచయం చేస్తున్నాం. స్క్రీన్‌పై ఆమె పవర్‌ఫుల్ నటనకు సాక్షులుగా ఉండండి” అంటూ రాసుకొచ్చారు. అయితే అభిరామి పాత్ర విశేషాల సమాచారమేమీ ఇందులో రివీల్ చేయలేదు. ఆమె మూవీ సెట్‌లో టీమ్‌తో ఉన్న దృశ్యాలే ఇందులో చూపించారు. కానీ, కథలో కీలకంగా ఉండే శ్వేత క్యారెక్టర్‌లో అభిరామి నటిస్తుందని మాత్రం వెల్లడించారు. ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 10న వివిధ భాషల్లో విడుదల కానుంది.