30-03-2025 12:00:00 AM
సమ్మర్‌లో లిక్విడ్ ఫౌండేషన్‌ను ఎంచుకోవాలి. లిక్విడ్ ఫౌండేషన్ సహజంగా ఉండి తొందరగా చర్మంలోకి వెళ్లిపోతుంది. అలాగే ఎలాంటి ఇరిటేషన్ సమస్యలు ఉండవు. లేదంటే మీకు ఇష్టమైన మాయిశ్చరైజర్, ఫౌండేషన్ కలపడం ద్వారా ఇంట్లోనే లిక్విడ్ ఫౌండేషన్ తయారు చేసుకోవచ్చు. ఇది మచ్చలను కనపడకుండా చేస్తుంది. అలాగే వేసవిలో చర్మ సంరక్షణకు తోడ్పడుతుంది. వేసవికాలంలో చర్మంపై మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ మొటిమలను తగ్గించుకోవడం కోసం సున్నితమైన, లైట్ వెయిట్ ఫౌండేషన్ ఎంచుకోవాలి. అలాగే వేసవిలో చర్మం నల్లబడుతుంది. కాబట్టి డీప్ షేడ్ ఉన్న ఫౌండేషన్ ఎంచుకోవడం ఉత్తమం.
వేసవికాలంలో మేకప్ వేసుకోవడం
అంటే చాలా కష్టంతో కూడుకున్నది. ఎంతో కష్టపడి వేసుకున్న మేకప్ వేడికి కరిగిపోతుంది. కాబట్టి సమ్మర్‌లో సూపర్ లైట్ వెయిట్, షీర్, క్రీమ్ ఫౌండేషన్ వంటివి ఎంచుకోవడం బెటర్. చెమటను నివారించేవి, వాటర్ ప్రూఫ్ ప్రొడక్ట్స్ ఎంచుకోవడం ఉత్తమం. అలాగే ఫౌండేషన్ ఎంపిక కూడా చాలా ముఖ్యం. దాని కోసం కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది.