* కాటన్, లినెన్, పాలిస్టర్.. దళసరిగా ఉండేవి, పలుచగా ఉన్నవీ ఇలా అన్ని రకాల్నీ కలిపి ఒకేసారి నానబెట్టడం, ఉతకడం వంటివి చేయొద్దు. ఏ రకానికి అదే విడిగా ఉతికితే ఒకటి ఆరడం, మరొకటి చెమ్మగా ఉండే సమస్య ఉండదు. దుర్వాసనా రావు. అలానే, ఎక్కువ రోజులు మాసి ఉన్నా, తడిచినవి ఉతుకుతున్నా.. ఆ సర్ఫ్ తోపాటు కాస్త బేకింగ్ సోడా కూడా కలపండి. ఇది క్రిములను దూరం చేస్తుంది. ఆరేసినా దుర్వాసన రావు.
* డిటర్జెంట్‌కి కాస్త నిమ్మకాయ రసాన్నీ చేర్చితే.. దుర్వాసనకు కారణమయ్యే శిలీంధ్రాలను తొలగిస్తుంది. అలానే ఏ కాస్త తేమ ఉన్నా దుస్తుల నుంచి వచ్చే వాసన మారిపోతుంది. అందుకే వాటితో రోజ్మేరీ ఆకులూ, సిలికాజెల్ పౌచ్లూ, సుద్ద ముక్కలు వంటివి ఉంచండి. తేమ తొలగి దుర్వాసన రాకుండా ఉంటుంది.
* దుస్తులు సువాసన రావడానికి వివిధ రసాయన ద్రవాలను వాడే బదులు బేకింగ్ సోడా, రోజ్ వాటర్ మిశ్రమంలో చివరగా ఓసారి జాడించి ఆరేయండి.. దీంతో దుస్తులు పరిమళాలు వెదజల్లుతాయి.