ఇస్లామాబాద్: కరాచీ వేదికగా ఈ నెల 30న పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు ప్రేక్షకులు లేకుండానే జరగనుంది. ఈ మ్యాచ్కు సంబంధించిన టికెట్ల విక్రయాలను కూడా నిలిపివేసింది. ఎవరైతే ఇప్పటి వరకు టికెట్లు కొనుగోలు చేశారో వారికి ఫుల్ రీఫండ్ ఇవ్వనున్నట్లు పీసీబీ ప్రకటించింది. వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో స్టేడియానికి మెరుగులు దిద్దనున్నారు. ఈ క్రమంలోనే పాక్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. 1996 వరల్డ్ కప్ తర్వాత పాక్లో జరుగుతున్న మెగా ఐసీసీ ఈవెంట్ ఇదే కావడం గమనార్హం.