calender_icon.png 2 February, 2025 | 11:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హీరోహీరోయిన్ లేకుండానే..

01-02-2025 12:00:00 AM

ఆర్‌పీ పట్నాయక్ కథ రచనా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కాఫీ విత్ ఏ కిల్లర్’. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీ శ్ నిర్మించిన ఈ సినిమాలో టెంపర్ వంశీ, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేశ్, రవిబాబు, అంబటి శ్రీను, శ్రీరాప, జెమిని సురేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనుష్ గోరక్ డీవోపీ, ఎడిటర్, డీఐగా వ్యవహరించగా తిరుమల మాటలు రాశారు. క్రైమ్ జోన ర్‌లో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది.

ఓటీటీ విడుద ల విషయాన్ని వెల్లడించేందుకు చిత్రబృందం మీడియాతో సమావేశమైంది. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో చిత్ర దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్ మాట్లాడుతూ.. ‘హీరో హీరోయిన్ లేకుండా ఒక సినిమా తీయాలంటే ఎలా అన్న ఆలోచనతో ఈ కథ మొదలైంది. కథ హీరో అయితే ఎలా ఉంటుందని ఈ కథ రాశాం. మా అన్నయ్య గౌతమ్ పట్నాయక్ ఈ సినిమాను మొత్తం దగ్గరుండి చూసుకున్నారు.

ఈ చిత్రంలో నటీనటుల క్యారెక్టర్లు కొన్ని ఎంతో ప్రత్యేకంగా, కొత్తగా ఉంటాయి. ఇందులో హీరో హీరోయిన్ ఉండరు కానీ విలన్ ఉంటాడు’ అన్నారు. నిర్మాత సెవెన్ హిల్స్ సతీశ్ మాట్లాడుతూ.. ‘రెండు గంటలపాటు ప్రేక్షకుల్ని ఎక్కడికీ కదలకుండా చేసే ఒక ప్రత్యేకమైన చిత్రం ఇది. సినిమా అంటే పాటలు, యాక్షన్ కాకుండా ఒక కాన్సెప్ట్‌ను కథగా అనుకుని సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’ అని చెప్పారు.