calender_icon.png 19 January, 2025 | 12:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడుగుదూరంలో

17-09-2024 12:33:14 AM

  1. సెమీస్‌లో కొరియాపై భారత్ విజయం 
  2. నేడు చైనాతో ఫైనల్ పోరు 
  3. హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ

పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యంతో చరిత్ర సృష్టించిన భారత హాకీ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటికే నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిచిన టీమిండియా మరోమారు ఫైనల్లో అడుగుపెట్టింది. టోర్నీలో ఆది నుంచి ప్రత్యర్థులపై ఎదురుదాడికి దిగిన హర్మన్ సేన సెమీస్‌లోనూ అదే జోరును చూపించింది. నేడు చైనాతో జరగనున్న టైటిల్ పోరులో అదే జోరును కనబరిచి ఐదోసారి విజేతగా నిలవాలని హర్మన్ సేన ఉవ్విళ్లూరుతోంది.

హులున్‌బిర్ (చైనా): పురుషుల హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్‌గా అడుగుపెట్టిన భారత జట్టు టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. సోమవారం జరిగిన రెండో సెమీఫైనల్లో హర్మన్ సేన 4 తేడాతో దక్షిణ కొరియాను చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ (ఆట 19వ, 45వ నిమిషంలో), ఉత్తమ్ సింగ్ (13వ ని.లో), జర్మన్‌ప్రీత్ సింగ్ (32వ ని.లో) గోల్స్ సాధించారు. ఇక యాంగ్ జిహున్ (33వ ని.లో) కొరియాకు ఏకైక గోల్ అందించాడు. 60 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి మూడు క్వార్టర్స్‌లోనే భారత్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది.

తొలి క్వార్టర్‌లో ఉత్తమ్ గోల్ కొట్టి బోణీ చేయగా.. మరో ఆరు నిమిషాలకు ఒలింపిక్స్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ కెప్టెన్ హర్మన్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. తొలి రెండు క్వార్టర్లు ముగిసేసరికి టీమిండియా 2 ఆధిక్యంలో నిలిచింది. మూడో క్వార్టర్‌లో కొరియా తరఫున గోల్ నమోదైనప్పటికీ అటు భారత్ నుంచి జర్మన్ గోల్‌తో మెరవడంతో మూడు క్వార్టర్లు పూర్తయ్యేసరికి 3 నిలిచాయి. ఇక నాలుగో క్వార్టర్స్ ప్రారంభంలోనే హర్మన్ మరోసారి మెరుస్తూ డబుల్ గోల్ సాధించాడు.

అయితే మరో 8 నిమిషాల్లో ఆట పూర్తవుతుందనగా గోల్ కీపర్ కర్కేరా అద్భుత ప్రతిభ కనబరుస్తూ రెండుసార్లు పెనాల్టీ కార్నర్‌లను సమర్థంగా అడ్డుకొని విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక హర్మన్‌కు ఈ టోర్నీలో ఇది ఏడో గోల్ కావడం విశేషం. అంతకముందు జరిగిన జరిగిన తొలి సెమీఫైనల్లో చైనా 2 పాకిస్థాన్‌పై  షూటౌట్‌లో విజయం దక్కించుకుంది.

నిర్ణీత సమయానికి ఇరుజట్లు 1 నిలవడంతో షూటౌట్ ద్వారా ఫలితాన్ని తేల్చారు. పాక్ తరఫున నదీమ్ అహ్మద్.. చైనా తరఫున లు యాన్‌లిన్ గోల్స్ సాధించారు. చైనా ఫైనల్లో అడుగపెట్టడం ఇదే తొలిసారి కాగా.. మంగళవారమే మూడో స్థానం కోసం కొరియా, పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.