తెలంగాణలోనూ బుల్డోజర్ సంస్కృతి
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 9(విజయక్రాంతి ): కాంగ్రెస్ పదినెలల పాలనలో అన్ని వర్గా లు అసంతృప్తితో ఉన్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం కాంగ్రెస్ సీనియర్ లీడర్ మహ మ్మద్ అలావుద్దీన్ పటేల్‌తో పాటు ఆయన అనుచరులు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ సంద ర్భంగా ఆయన రాష్ర్ట ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ లో బతుకమ్మ ఘాట్ చూసేందుకు ఓ తాసీ ల్దార్ వెళ్లగా ఇళ్లు కూలగొట్టేందుకు వచ్చార నుకొని అధికారులను తరమికొట్టినట్లు తెలిసిందన్నారు.
మూసీకి లక్షా 50 వేల కోట్లు..
తెలంగాణలోనూ బుల్డోజర్ సంస్కృతి నడుస్తోందని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ జాబ్ పోగొడితే 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాహుల్‌గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి గ్యారంటీ ఇచ్చారని, అయితే కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత రేవంత్, రాహు ల్‌కి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని, యు వతకు రాలేదని పేర్కొన్నారు. హామీల గురిం చి అడిగితే పైసలు లేవని అంటున్నారని కానీ మూసీ కోసం మాత్రం లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తారట అంటూ ఎద్దేవా చేశారు. లక్ష కోట్లు మింగి రాహుల్‌కు దోచి పెట్టొ చ్చన్న యోచనలో ప్రభుత్వం ఉందన్నారు.
మోదీ బెదిరింపులకు భయపడలేదు..
మోదీ ప్రభుత్వం తమను బెదిరించేందు కు ప్రయత్నించిందని, తన చెల్లిని జైల్లో పెట్టా రని, అయినా తల వంచలేదన్నారు. మోదీ తో పోరాటం చేశామన్నారు.
నియామకాలపై నీతిమాలిన ప్రచారం
ప్రభుత్వ నియామకాలపై సీఎం రేవంత్ రెడ్డి నీతిమాలిన ప్రచారం చేస్తున్నారని కేటీ ఆర్ ధ్వజమెత్తారు. ఉద్యోగాల నియామకాల పై అయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. గత ప్రభుత్వ ఉద్యోగాలను కాంగ్రెస్ ఖాతా లో వేసుకోవడానికి సిగ్గుండాలన్నారు. కాగా జ్యోతిబాఫూలే విదేశీ విద్య పథకానికి ప్రభు త్వం తూట్లు పొడుస్తోందని ఆరోపించారు.