09-03-2025 12:18:37 AM
సీఎంకు మంద కృష్ణమాదిగ లేఖ
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 8 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని ఉద్యోగ పరీక్ష ఫలితాలు నిలిపేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గతంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగ నియామకాలు చేస్తామని అసెంబ్లీలో సీఎం ప్రకటన చేశారన్నారు.
ఈ నెల 12 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ కోసం చట్టం చేస్తామని సీఎం చెప్పారన్నారు. మరో వైపు గ్రూప్స్ ఫలితాలను వెల్లడిస్తామని చెపుతుండటంతో తమ జాతి ప్రజలు మరోసారి నష్టపోతారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ పోరాటానికి ఫలితం రాబోతుందనకునే సమయంలో వర్గీకరణ లేకుండా పరీక్షల ఫలితాలు ప్రకటిస్తే ఓరుకోమని హెచ్చరించారు.