calender_icon.png 28 December, 2024 | 5:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొరడా దెబ్బలు కొట్టుకుని..

28-12-2024 01:47:47 AM

మొక్కు తీర్చుకున్న తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై 

చెన్నై, డిసెంబర్ 27: తమిళనాడులో చెడు అంతం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై శుక్రవారం కొయం బత్తూరులోని ఆయన నివాసం ఎదుట స్వయంగా ఆరు కొరడా దెబ్బలు కొట్టుకుని మురుగన్‌స్వామి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కొరడా దెబ్బలు భరించడం భారత సంస్కృతిలో భాగమే.

బీజేపీ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నది. అన్నా యూనివర్సిటీలో విద్యార్థిని లైంగిక వేధింపులకు గురి చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని మేం డిమాండ్ చేస్తున్నా’మని డిమాండ్ చేశారు. చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో ఓ విద్యార్థిని లైంగిక వేధింపులకు గురికావడం రాష్ట్రంలో ఆందోళనలకు దారి తీసింది.

దీనిలో భాగంగానే గురువారం కే అన్నామలై ప్రెస్‌మీట్ పెట్టి మరీ ‘రాష్ట్రంలో డీఎంకే పార్టీని గద్దె దించే వరకు నేను చెప్పులు వేసుకోను. ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన తర్వాతే తిరిగి చెప్పులు వేసుకుం టాను’ అని ప్రకటించారు. ఈ మేరకు మురుగన్‌కు మొక్కుకుంటున్నానని వెల్లడించారు. దీనిలో భాగంగానే ఆయన తనకు తాను కొరడా దెబ్బలు కొట్టుకుని మొక్కు తీర్చుకున్నారు.