calender_icon.png 22 December, 2024 | 2:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ ఫేస్ ప్యాక్‌తో..

17-10-2024 12:00:00 AM

ఎర్ర చందనంతో చర్మం కాంతివంతంగా.. తాజాగా మెరుస్తుంది. ఎర్ర చందనాన్ని కాస్మొటిక్స్‌లో.. బ్యూటీ ప్రొడెక్ట్స్‌లో వాడతారు. ఈ ఫేస్ ప్యాక్ చర్మంపై ఉండే మచ్చలను, మొటిమలను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఓసారి చూసేయండి..

* మూడు చెంచాల ఎర్ర చందనం పొడిలో సరిపడా బొప్పాయి గుజ్జు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లు చేసుకొని 20 నుంచి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది. ఈ ప్యాక్ వల్ల చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ పూర్తిగా తొలగిపోతాయి. 

* ఎర్ర చందనం పొడిలో రెండు చెంచాల పాలు, ఒక చెంచా తేనె కలిపి ముఖానికి అప్లు చేసుకోవాలి. అరగంట పాటు అలాగే వదిలేయాలి. ప్యాక్ బాగా ఆరిన తర్వాత ముఖాన్ని గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు రోజులకొకసారి చేస్తే ముఖంపై ఉండే జిడ్డు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. 

* రెండు చెంచాల ఎర్ర చందనం పొడిలో ఒక చెంచా పెరుగు కలిపి ముఖానికి అప్లు చేసుకోవాలి. ఈ ప్యాక్ ఐదు నుంచి పది నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది. ఇలా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. 

* ఎర్ర చందనం పొడిలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లు చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను 10 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ప్యాక్ పూర్తిగా ఆరిన తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగితే సరిపోతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి. 

* ఎర్ర చందనం పొడిలో రెండు చెంచాల నిమ్మరసం కలిపి ముఖానికి అప్లు చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను ముఖంపై ఒక 15 నిమిషాలు ఉంచుకొని.. ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మంపై జిడ్డు తొలగిపోతుంది.