08-04-2025 01:06:48 AM
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి
తుంగతుర్తి, ఏప్రిల్ 7: గ్రామ దేవతల ఆరాధనతో గ్రామాలు సుభిక్షంగా ఉంటున్నాయని తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని వెంపటి గ్రామంలో రెండు రోజుల నుంచి గ్రామ యాదవ సంఘం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న యాదవుల ఆరాధ్య దైవమైన ఎల మంచమ్మ పండుగకు గిరిధర్ రెడ్డి హాజరై ప్రత్యేక స్థానిక నాయకులతో కలిసి పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూకాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా పండుగలు చేసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా ఎలమంచమ్మ తల్లి బేరీలకు రూ.10000 వేలు ఆర్థిక సహాయం అందజేశారు.యాదవ మహిళలు ప్రత్యేకంగా అలంకరించిన బుట్టలలో బోనాలు తీసుకువచ్చి తల్లికి సమర్పించి కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ మొక్కలు చెల్లించుకున్నారు.ఈ వేడుకల్లో వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు