చలికాలంలో బరువు తగ్గాలన్నా.. శారీరకంగా, మానసికంగా ఫిట్‌నెస్ ఉండాలన్నా.. వర్కవుట్స్ చాలా అవసరం. మిగతా సీజన్‌లా ఉదయాన్నే నిద్రలేవటం కష్టం. ఈ కష్టమైన పరిస్థితుల మధ్య స్మార్ట్‌గా వ్యవహరిస్తే ఫిట్‌నెస్‌తో పాటు ఆరోగ్యంగా ఉండవచ్చు.
చలికాలంలో వర్కవుట్స్ చేయకుండా ఉదయాన్నే నడక, రన్నింగ్ చేయడం వల్ల ఉపశమనం పొందుతారు. రక్తప్రసరణ సాఫీగా జరగటమే కాకుండా నిద్రమత్తు వదులుతుంది. జాగింగ్ తర్వాత శరీరాన్ని స్ట్రెచ్ చేయడం చేయాలి. ఎలాంటి గాయాలపాలు కాకుండా జాగ్రత్తగా స్ట్రెచ్ చేసుకోవాలి. ఇక సూర్యనమస్కారాలు చేయడం కూడా మంచిది. దీనివల్ల మిటమిన్‌డి శరీరానికి అందుతుంది.
మానసికంగా ఒత్తిడి ఉంటే మాత్రం కచ్చితంగా మెడిటేషన్ చేయడం మంచిది. దీనివల్ల మెంటల్లీ బ్యాలెన్స్ అవుతారు. ప్రశాంతత వస్తుంది. చలికాలంలో దగ్గులు, ఇతర సీజనల్ సమస్యలు ఎదురవుతాయి. అందుకే సూప్స్, గ్రీన్ టీ లాంటివి వేడివేడిగా తీసుకోవాలి.
ఏదైనా సరే తాజా ఆహారం తినటం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. యోగాకి అధిక సమయం కేటాయించడం, సోషల్ మూవింగ్ ఉండటం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. చలికాలంలో శరీరం యాక్టివ్‌గా ఉండాలంటే ఫిట్‌నెస్ తప్పనిసరి. సరైన నిద్ర, తాజా ఆహారం తిన్నప్పుడే ఫిట్‌గా ఉంటారు.