కష్టాల్లో ఉన్నవారికి అండగా ఉండటానికి ఎప్పుడూ ముందుంటాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఆయన మరోమారు తన గొప్ప మనసును చాటుకున్నారు. కేరళలోని వయనాడ్ జిల్లాలో చోటుచేసుకున్న ఉపద్రవాన్ని దృష్టిలో ఉంచుకొని తాజాగా హీరో ప్రభాస్ భూరి విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2 కోట్లు విరాళం ఇస్తున్నట్టు ప్రభాస్ వ్యక్తిగత బృందం ప్రకటించింది. వయనాడ్ ప్రజలకు తన ప్రగాఢ సానుభూతిని ప్రభాస్ తెలియజేశారు. ఈ కష్ట సమయంలో కేరళ ప్రజలు ధైర్యంగా ఉండాలని సూచించారు. వారికి మనమంతా అండగా ఉండాలని ప్రభాస్ కోరారు. ప్రభాస్ స్పందించిన తీరుపై సినీప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు ప్రభాస్‌పై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. ‘కల్కి’ సినిమాలో ప్రభాస్ పాత్ర ‘కర్ణుడు’ కావటంతో ‘ప్రభాస్ దాన కర్ణుడు అని నిరూపించుకున్నాడు’ అంటూ జేజేలు పలుకుతున్నారు. పాత్ర ఇప్పటివరకు విరాళం ప్రకటించిన టాలీవుడ్ ప్రముఖుల్లో ఇంత పెద్ద మొత్తం ఆర్థిక సహాయం అందించిన హీరో ప్రభాస్ కావటం విశేషం అంటూ నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు.