calender_icon.png 21 April, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూర్యాపేట్ పరిసరాల కథతో..

20-04-2025 12:00:00 AM

ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా నటించిన చిత్రం ‘సూర్యాపేట్ జంక్షన్’. రాజేశ్ నాదెండ్ల దర్శకత్వంలో యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అనీల్‌కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు నిర్మించారు. నటుడు అభిమన్యు సింగ్ కీలక పాత్రలో నటించారు. సూర్యపేట పరిసరాల్లో జరిగే కథ ఇది. ప్రభుత్వం నుంచి ఉచితాలు తీసుకోవడం వల్ల మధ్యతరగతి ప్రజలు ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుంటున్నారనే కథతో ఈ సినిమా రూపొందింది.

ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో గ్లోబల్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రానికి డీవోపీ: అరుణ్‌ప్రసాద్; సంగీతం: రోషన్ సాలూరి, గౌర హరి; సాహిత్యం: ఏ రహమాన్; ఎడిటర్: ఎంఆర్ వర్మ; కథ: ఈశ్వర్.