calender_icon.png 19 January, 2025 | 12:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఊరికి నీరిచ్చిన వ్యక్తి కథతో..

31-08-2024 01:05:30 AM

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తన నటనా కౌశలాన్ని చాటిన ప్రియాంక చోప్రాకు ప్రత్యేక గుర్తింపు అవసరం లేదు. నటిగానే కాక సినీ నిర్మాతగానూ సత్తా చాటుతోందీమె. రాజశ్రీ మరాఠీ ప్రొడక్షన్స్‌తో కలిసి ప్రియాంక.. తన సొంత నిర్మాణ సంస్థ పర్పుల్ పెబుల్ పిక్చర్స్ పతాకంపై ఓ మరాఠీ చిత్రాన్ని నిర్మించింది. ఆ సినిమానే ‘పానీ’. ప్రియాంక తన ప్రొడక్షన్ హౌస్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు నిర్మించగా తాజా చిత్రం ‘పానీ’ మూడోది. అక్టోబర్ 18న థియేటర్ల ద్వారా సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తోంది. తాజాగా ముంబయిలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ప్రియాంక మాట్లాడుతూ.. “పానీ’ చిత్రానికి ఆదినాథ్ కొఠారే దర్శకుడు. హనుమంత్ కేంద్రే జీవితం చుట్టూ తిరుగుతుందీ సినిమా. తన గ్రామంలో నీటి సమస్యలను ఎలా పరిష్కరిస్తాడనేది ఈ సినిమా కథను మరింత ఆకర్షణీయంగా మార్చింది. హనుమంత్ నిజ జీవిత పోరాట స్ఫూర్తికి ఆదినాథ్ బాగా ప్రభావితమయ్యాడు. అతను హనుమంత్ మీద చేసిన సినిమానే ఇది” అని చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా.