‘నీది నాది ఒకే కథ’, ‘విరాట పర్వం’ వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వేణు ఉడుగుల నిర్మాతగా మారి తన తొలి నిర్మాణ సంస్థను ప్రకటించారు. రాహుల్ మోపిదేవితో కలిసి డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్స్ టేల్స్ బ్యానర్‌పై ఓ సినిమాను నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి మేకర్స్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ఖమ్మం, వరంగల్ బోర్డర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం యధార్థ కథ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాను మేకర్స్ మంగళ వారం ప్రకటిస్తూ టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ టైటిల్ గ్లింప్స్ లాంచ్ కార్యక్రమం లో నిర్మాత వేణు ఉడుగుల మాట్లాడుతూ.. ‘సాయిలు నాతో మూడేళ్లుగా ట్రావెల్ చేస్తు న్నాడు. ఒకరోజు వాళ్ల ప్రాంతంలో జరిగిన ఒక ట్రూ ఇన్సిడెంట్ను బేస్ చేసుకుని ఒక కథ రాశానని చెప్పాడు.
ఆ కథ నాకు బాగా నచ్చిం ది. కథలో ఉన్న ఎన్నో సెన్స్, కథ జరిగే ప్రాం తం, పాత్రలు, ఆ పాత్రల మధ్య సంఘర్షణ.. అన్నీ నన్ను బాగా ఎట్రాక్ట్ చేశాయి. క్లుమైక్స్ మూడు రోజులపాటు నిద్రపోనివ్వలేదు. ఇంత వైవిధ్యమైన ప్రేమ కథను నేనెప్పుడూ చూడలేదు, వినలేదు. ఈ కథను సినిమాగా తీయాలని స్ట్రాంగ్ ఇంటెన్షన్‌తో ఈటీవీ విన్ వాళ్లతో షేర్ చేశాం. వాళ్లు కూడా కథ విని హ్యాపీగా ఫీలయ్యారు’ అన్నారు.
ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయికృష్ణ మాట్లాడుతూ.. ‘ఇది రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ కథ. పాత్రలన్నీ చాలా సహజంగా ఉంటాయి’ అని చెప్పారు. ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ మాట్లాడు తూ.. “థియేటర్లకు సత్తా ఉన్న కథను తీసుకెళ్దా మనుకున్నాం, అందులో మేము చేస్తున్న మొదటి ప్రయత్నం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈ కథ విన్నప్పుడే థియేటర్స్ సినిమా అనుకున్నాం. గొప్ప థియేటర్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది” అని తెలిపారు.
డ్రమ్మర్‌తో ప్రేమలో పడే యెనగంటి రాంబాయి..
ఈ టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్లో హీరో డ్రమ్ వాయిస్తూ ఉండగా అతని పక్కన తన ప్రేమికురాలిని ప్రజెంట్ చేస్తోంది. టైటిల్ గ్లింప్స్ అమ్మాయి ఈ డ్రమ్మర్‌తో ప్రేమలో పడిన యెనగంటి రాంబాయిగా తనను తాను పరిచయం చేసింది. అతను డ్రమ్స్ వాయించే విధానాన్ని ఆమె ఇష్టపడుతుంది. ఇల్లందులోని బొగ్గు గనుల వంటి గ్రామంలో తన ప్రేమకథ పాపులర్ అని ఆమె చెబుతుంది.
ఆమె తమ ప్రేమకథను తీన్మార్, దో మార్, నాగిని అని చెప్పడం ఆసక్తికరంగా ఉంది. టైటిల్, గ్లింప్స్ ప్రకారం ‘రాజు వెడ్స్ రాంబాయి’ తెలంగాణ నేపథ్యంలో సాగే అందమైన గ్రామీణ ప్రేమకథ. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని 2025, ఫిబ్రవరి 14న ఈ సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి డీవోపీ: వాజిద్ బేగ్; సంగీతం: సురేశ్ బొబ్బిలి; ఎడిటర్: నరేశ్ అడుప; సాహిత్యం: మిట్టపల్లి సురేందర్.