29-03-2025 11:10:13 PM
కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు..
ఉల్లాసంగా ఇఫ్తార్ విందు..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రంజాన్ మాసం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ రాగద్వేషాలను దూరం చేసుకుని ప్రేమానురాగాలతో కలిసిమెలిసి జీవించాలని కొత్తగూడెం శాసనసభ్యులు సాంబశివరావు అన్నారు. శనివారం సాయంత్రం పాల్వంచ పట్టణ పరిధిలోని సుగుణ గార్డెన్ లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. సంజీవరావు పాల్వంచ డీఎస్పీ సతీష్, పాల్వంచ MRO వివేక్, మున్సిపల్ కమిషనర్ సుజాత, సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కొత్వాల శ్రీనివాస, నాగసీతారాములు, సీపీఐ రాష్ట్ర నాయకులు ముత్యాల విశ్వనాథం, నారాటి ప్రసాద్, ముస్లిం మైనార్టీ నాయకులు నయీమ్ ఖురేషి గౌస్, కృర్షిద్, ఫయాజ్ ముత్తు జాలి, కృషి, అస్లాం, రషీద్, రెహమాన్, గౌస్ సీపీఐ కాంగ్రెస్ నాయకులు ఎర్రం శెట్టి ముత్తయ్య, కొండా వెంకన్న, బండి నాగేశ్వరావు, ఉప్పుశెట్టి రాహుల్, అన్నారపు వెంకటేశ్వర్లు, వీసంశెట్టి విశ్వేశ్వరరావు, పాల్వంచ ప్రముఖులు డాక్టర్ సూర్యదేవర రామ్మోహన్రావు, డాక్టర్ సుధాకర్, కొత్త వెంకటేశ్వర్లు ముస్లిం మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.