calender_icon.png 20 October, 2024 | 1:48 PM

సాంకేతికతతో సాయంగా!

14-10-2024 12:00:00 AM

ప్రస్తుతం రోజుకో కొత్త టెక్నాలజీ పుట్టుకొస్తోంది. దాంతో మొబైళ్లు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు దైనందిన జీవితంలో భాగమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్స్ సాంకేతికను అందిపుచ్చుకుంటూ.. అనేక విషయాలను నేర్చుకుంటూ.. రోజువారీ కార్యకలాపాలను సులభతరం చేసుకుంటున్నారు. యూత్‌కు సమానంగా టెక్నాలజీ వాడుతూ ‘వీ ఆర్ సో స్మార్ట్’ అని చెప్పకనే చెబుతున్నారు. 

చిటికెలో ఇంటి పనులు

ప్రస్తుతం బిజీలైఫ్ కారణంగా చాలామంది పెద్దవాళ్లు ఇంటి పనులు, వంట పనులు చేసుకోవాల్సి వస్తోంది. చిన్న చిన్న విషయాలకు ఇతరులపై ఆధారపడకుండా మిషన్స్, వంట పరికరాలు వాడుతూ సొంతంగా పనులు చక్కబెట్టుకుంటున్నారు.

స్వీపిం గ్ మిషన్ లాంటివాటితో ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటున్నారు. ఇక వంట తయారీకి కూడా కుకింగ్ గ్యాడ్జెట్లు వాడుతూ తమ పనులను సులభతరం చేసుకుంటున్నారు. మార్కెట్లో రకరకాల గ్యాడ్జెట్లు దొరుకుతుండటంతో ఇతరులపై ఆధారపడకుండా రోజువారి పనులు సులభంగా చేసుకుంటున్నారు.

ప్రపంచంతో కనెక్ట్ 

ఈరోజుల్లో పిల్లలు ఒకచోట, తల్లిదండ్రులు మరోచోట ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బంధువులు, స్నేహితులు సైతం ఏ విదేశాల్లో ఉం టూ అప్యాయతకు దూరంగా ఉండిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఒంటరితనం చెక్ పెట్టేందుకు చాలామంది సోషల్ మీడియాను వాడుతున్నారు.

స్మార్ట్ ఫోన్ సాయంతో అవతలవారితో కనెక్ట్ అవుతూ  వీడియో కాల్స్, జూమ్ కాల్స్ చేస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. అంతేకాదు.. ఫేస్ బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్ లాంటి మాధ్యమాలను వాడుతూ సమాజానికి దగ్గరగా ఉంటున్నారు. విస్తృతమైన సోషల్ నెట్‌వర్క్ ను ఏర్పర్చుకొని అయినవారికి మరింత దగ్గరవుతున్నారు. 

ఆరోగ్య పర్యవేక్షణ

ప్రస్తుతం అన్ని వయసులవారు ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు పెడుతున్నాయి. వృద్ధులు మరి న్ని సమస్యలతో సతమతమవుతున్నారు. ఈక్రమం లో సాంకేతిక పరిజ్ఞానం వృద్ధులకు వరంగా మారింది. హెల్త్ గ్యాడ్జెట్లు వాడుతూ ఎప్పటికప్పుడు అనారోగ్య సమస్యలను తెలుసుకుంటున్నారు. మానిటరింగ్ పరికరాలతో రక్తపోటు, హృదయ స్పందన రేటు, బరువు చెక్ చేసుకుంటూ ఆరోగ్యవంతంగా ఉంటున్నారు. ఇక ఫిట్‌నెస్ యాప్స్ శారీ రకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటున్నారు. 

-ఒంటరి జీవితాలకు భరోసా

రిటర్‌మెంట్ తర్వాత చాలామంది ఇంటికే పరిమితమవుతుంటారు. అలాంటివారు ఒంటరిగా ఉన్న సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో హోం గ్యాడ్జెట్లు వాడుతూ భద్రమైన జీవితాలు గడుపుతున్నారు. ఒంటరిగా నివసించే సీనియర్లు మానిటరింగ్ సిస్టమ్స్‌వాడుతున్నారు. ఇంట్లోవాళ్లు ఏదైనా ప్రమాదంబారిన పడితే ఆటోమేటిక్ నోటిఫికేషన్స్ ఇతరులకు వెళ్తాయి. రిమైండర్లు, టైమర్లను, వాయిస్ యాక్టివేటెడ్ డివైజ్ లు వాడుతూ ప్రమాదల బారిన పడకుండా ఉండగలుగుతున్నారు. 

నిమిషాల్లో సమాచారం

కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి ఆసక్తిచూపుతున్నారు. ఇందుకోసం స్మార్ట్ టీవీ, రేడియో ద్వారా సమాచారం తెలుసుకుంటున్నారు. న్యూస్‌కు సంబంధించిన యాప్స్ వాడుతూ.. ప్రపంచంలో ఏ మూలన ఏం జరుగుతుందో నిమిషాల్లో తెలుసుకుంటున్నారు. కొత్త కొత్త భాషలు నేర్చుకుంటూ ఇతరులతో కనెక్ట్ అవుతున్నారు. 

హెల్దీగా, యంగ్‌గా

వయస్సుతో సంబంధం లేకుండా ఇష్టమైన ఆట్లలో రాణిస్తున్నారు. ఇందుకోసం తమకు ఇష్టమైన ఆటను ఎంచుకొని అందులో పతకాలు సాధిస్తున్నారు. అలాగే రన్నింగ్, వాకింగ్, వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఆనందంగా ఉంటున్నారు. ఇందుకోసం స్మార్ట్ షూ, స్మార్ట్ వాచ్‌లు వాడుతూ చురుగ్గా ఉంటున్నారు.