15-03-2025 12:00:00 AM
కన్నతల్లిని హతమార్చిన కూతురుకు సహకరించిన భర్త
నిజామాబాద్, మార్చి 14 (విజయక్రాంతి) : మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి అనడానికి అనడానికి నిదర్శనంగా నిజాంబాద్ నగరంలో సంఘటన జరిగింది కన్న కూతురే తన భర్తతో కలిసి సొంత తల్లిని హతమార్చింది. కానీ పెంచిన తల్లి ని భారంగా భావించిన తల్లిని కాటికి పంపింది తన వ్యక్తిగత విషయాలకు అడ్డు చెప్తోందని కట్టుకున్న భర్తతో కలిసి తల్లిని చంపడానికై పక్కా ప్లాన్ వేసింది.
నిజామాబాద్ నగరంలోని నాగారంలో కన్న కూతురే తన భర్త సహాయంతో తల్లిని చంపిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. శ్రీ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి పోలీసులు స్థానికుల కథనం ప్రకారం నాగారం ప్రాంతంలోని క్వార్టర్స్ లకు చెందిన విజయలక్ష్మి గత నాలుగు సంవత్సరాలుగా కూతురు సౌందర్య ఇంట్లో ఉంటుంది.
గత కొన్ని రోజులుగా తల్లి విజయలక్ష్మి తమ ఇంటి విషయాలలో జోక్యం చేసుకుంటూ తనకు ఇబ్బందిగా మారిందని అన్నింటికీ అడ్డుగా వస్తుందనీ ఆమెను తొలగించుకోవాలని ఆమె హత్యకు పక్కా ప్లాన్ వేసింది.
సౌందర్య తన భర్త రమేష్ తో కలిసి ఎలాగైనా ఆమెను అడ్డు తొలగించుకోవాలని ఈనెల 12వ తేదీన మధ్య రాత్రిసౌందర్య తల్లి విజయలక్ష్మి నిద్రిస్తున్న సమయంలో ఆమె ముఖంపై తల దిండుతో నొక్కి చేతులను గొంతును గట్టిగా పట్టి ఊపిరాడకుండా చేసి హత్య కు పాల్పడ్డారు.
తల్లి విజయలక్ష్మి హత్యకు పాల్పడిన కూతురు సౌందర్య అల్లుడు రమేష్ ను శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో కోర్టులో హాజరు పరిచారు. హత్యకు పాల్పడ్డ నిందితులను తమదైన శైలిలో విచారణ జరిపి అరెస్ట్ చేసినట్టు నార్త్ రూరల్ సీఐ శ్రీనివాసు ను ఐదవ టౌన్ ఎస్సు గంగాధర్ ను ఏసిపి రాజా వెంకటరెడ్డి అభినందించారు.