22-02-2025 12:12:59 AM
*మూడు పంచాయతీల్లో నిలిచిపోయిన ఉపాధి హామీ పనులు
*ఉద్యాన పంటల రాయితీకి బ్రేక్
అశ్వరావుపేట, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి) ః ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిన అశ్వరావుపేట మున్సిపాలిటీ మార్పు ఎట్టకేలకు జనవరిలో అమలులోకి వచ్చింది. పట్టణ ప్రజలకు మున్సిపాలిటీ రావడం ఆనందదాయకమైనప్పటికీ, దానికి అనుసంధానంగా మూడు పంచాయతీలను మున్సి పాలిటీలో విలీనం చేయడం కూలీల పొట్ట కొట్టినట్లు అయిందని ఆవేదనలు వ్యక్తం అవుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఉపాధి హామీ పనులను నమ్ముకొని వేలాది నిరుపేద కుటుంబాలు జీవిస్తున్నాయి. నిబంధనల ప్రకారం అర్బన్ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు దూరం. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
నిలిచిపోయిన ఉపాధి హామీ పనులు..
అశ్వరావుపేట మండల పరిధిలో గల పేరాయి గూడెం, గుర్రాల చెరువు, అశ్వరావుపేట పంచాయతీలను అశ్వరావుపేట మున్సిపాలిటీ విలీనం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పనులకు బ్రేక్ పడింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఆ మూడు పంచాయతీల్లో ఉపాధి హామీ పనులు నిలిచిపోవడం నిరుపేదలకు ఆదాయ వనరులు దెబ్బతిన్నాయి. అశ్వరావుపేట పంచాయతీలో గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి 475 కార్డులలో 543 మంది యాక్టివ్ కూలీలుతోపాటు మరి కొంతమంది కూలీలు 7230 పని దినాలు పనిచేశారు.
పేరాయి గూడెం పంచాయతీలో 318 కార్డుల్లో 457 మంది యాక్టివ్ కూలీలతో పాటు మరి కొంతమంది కలిసి 9461 పని దినాలు చేశారు. గుర్రాల చెరువు పంచాయతీలో 91 కుటుంబాలకు 125 మంది కూలీలు 3492 పని దినా లు చేశారు. ప్రతి పంచాయతీలోనూ కూలీలకు సగటున రోజుకు రూ.200 కూలి గిట్టుబాటు అవుతుంది. ఈ లెక్కన వందల మంది కూలీలకు దాదాపు రూ 20వేల రోజులు పని దొరికేది. తాజాగా వీరందరికీ ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి ఉపాధి హామీ పనులు నిలిచిపోవడంతో ఇతర కూలీ పనులు దొరక్క ఇబ్బంది పడుతున్నారు.
264 మందికి ఆత్మీయ భరోసాపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ 12వేల చొప్పున ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అమలు చేస్తుంది. గత నెలలో జరిగిన గ్రామసభల్లో లబ్ధిదారులను ఎంపిక చేశారు. 2023 24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనులు చేసి రైతు భరోసా తీసుకొని పేదలను ఎంపిక చేయడం జరిగింది. అశ్వరావుపేటలో 108 మంది, పేరాయి గూడెంలో 115, గుర్రాల చెరువులో 41 మంది ఎంపిక అయ్యారు. ఈ పథకానికి సంబంధించిన నగదును త్వరలో బ్యాంక్ ఖాతా లో జమ చేస్తామని అధికారులు తెలిపారు. మున్సిపాలిటీలో విలీనం కావడంతో ఆత్మీయ భరోసాపై నీలినీడలు కమ్ముకున్నాయి.
రైతులకు రాయితీలు బంద్..
ఉపాధి హామీ పదారా రైతులకు అనేక రాయితీలు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం మునగ సాగుకు ఎకరానికి మొక్కలు నాటడానికి, ఇతర ఖర్చులకు రూ 1.14 లక్షలు ఇస్తున్నారు. పామాయిల్ సాగుకు మొక్కలు నాటడానికి, నిర్వాహన ఖర్చులకు, గుంతలు తీయడానికి, మూడేళ్ల పాటు ఎకరానికి రూ.2 లక్షలు రైతుకు అందుతుంది. గేదెల పెంపకానికి అవసరమైన షెడ్లు నిర్మించడానికిరూ 70 వేలను అందిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో వేరే పథకాలను అమలు చేస్తున్నారు. అశ్వరావుపేట మున్సిపాలిటీ కావ డంతో తాజాగా పనులు నిలిచి రైతుల ప్రయోజనాలకు బ్రేక్ పడినట్లు అయింది.
నిలిచిపోయిన ఇతర పథకాలకు..
గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.12వేలు, ఇంకుడు గుంతలు నిర్మాణానికి రూ.6,500 ప్రభు త్వం అందించేది. పంచాయతీలో సిసి రోడ్ల నిర్మాణానికి రూ.కోట్లు వెచ్చించేవారు. అర్బన్ ప్రాంతాల్లో అమలు చేసే స్వచ్ఛత మిషన్ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణానికి అవకాశం ఉన్న, మిగిలిన పథకాలాన్ని కొం డెక్కినట్టే. పథకాలు ఆగిపోవడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. అర్బన్ ప్రాం తాల్లో నిరుపేదలను ఆదుకునేలా పథకాలు ప్రవేశపెట్టాలని ప్రజలు కోరుతున్నారు.