calender_icon.png 26 February, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ సంకల్పంతోనే నిర్మాతగా మారా

26-02-2025 12:12:11 AM

‘మర్డర్’ ఫేమ్ ఘన ఆదిత్య, అచ్చ తెలుగమ్మాయి ప్రియ జంటగా రూపొందిన చిత్రం ‘తకిట తదిమి తందాన’. ఈ చిత్రం ద్వారా రాజ్ లోహిత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎల్లో మ్యాంగో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చందన్ కుమార్ కొప్పుల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా గురువారం (ఫిబ్రవరి 27) ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా నిర్మాత చందన్ కుమార్ కొప్పుల మాట్లాడుతూ... “ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ టైమ్‌లో నేను చూసిన కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ నన్ను విపరీతంగా ఇంప్రెస్ చేశాయి. అలాంటి చెరగని ముద్ర వేసే సినిమా చేయాలనే సంకల్పంతో నిర్మాతగా మారాను. ఆ క్రమంలోనే రాజ్ లోహిత్ పరిచయం కావడం, తను చెప్పిన కథతో నేను కనెక్ట్ కావడంతో రంగంలోకి దిగాను” అన్నారు.