calender_icon.png 25 October, 2024 | 4:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తన కంటే చిన్నవాడితో..

14-07-2024 04:42:45 AM

నయనతార గ్లామర్ రోల్స్ చేసిన రోజుల్లో ‘వల్లభ నా వల్లభ..’ పాటలో శింభుతో కలిసి చేసిన రొమాన్స్‌ను ఇప్పటికీ చూస్తూ కుర్రకారు నయనానందం పొందుతారు. 2006లో వచ్చిన ‘వల్లభ’ సినిమాలో తనకంటే చిన్నవాడైన స్టూడెంట్ వల్లభ (శింభు)తో ప్రేమాయణం నడిపే ప్రొఫెసర్ స్వప్నగా కనిపించింది నయన్. ఆ స్థాయి ఆనందం పంచకపోవచ్చు అయితే, పిన్న వయస్కుడిపై మనసు పడే కథతో మరోమారు ప్రేక్షకులను అలరించనున్నదట ఈ నటి! గీత రచయిత విష్ణు ఎడ్వాన్.. తొలిసారి దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకోనున్న ఈ సినిమాలో నయనతార కెవిన్‌తో కలిసి లీడ్‌రోల్‌లో కనిపిస్తారనేది కోలీవుడ్ టాక్.

ఇదిలా ఉండగా, నయన్.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టితో కలిసి మూడోసారి నటించేందుకు నటించనుంది. మలయాళంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతారే హీరోయిన్. నయనతార బాలాజీ నటించిన ఆధ్యాత్మిక చిత్రం ‘ముకుత్తి అమ్మన్’ (తెలుగులో ‘అమ్మోరు తల్లి’) సీక్వెల్‌లోనూ ఆమే నటిస్తోందని వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

ఇలా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కలిపి మొత్తం పది సినిమాలతో బిజీగా ఉన్న నయన్.. ఇటీవల ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ కెమెరా కంటికి చిక్కింది. ఈ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను నయనతార ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా, ‘స్వీటెస్ట్’ అని, ‘హాటెస్ట్’ అని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. పెళ్లయి, పిల్లలు పుట్టిన తర్వాత కూడా అభిమానులకు నయనానందకరంగానే కనిస్తుండటం విశేషమే కదూ!