calender_icon.png 15 January, 2025 | 10:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వీయ తప్పిదాలతో..

06-09-2024 12:22:12 AM

  1. మాజీ చాంపియన్ స్వియాటెక్ ఔట్ 
  2. రాకెట్‌తో నెట్‌ను కొట్టిన స్వియాటెక్ 
  3. సెమీస్‌కు దూసుకెళ్లిన సిన్నర్ 
  4. యూఎస్ ఓపెన్ 

విజయక్రాంతి, ఖేల్ విభాగం: సీజన్ చివరి గ్రాండ్ స్లామ్ టోర్నీ అయిన యూఎస్ ఓపెన్‌లో కొత్త చాంపియన్ పుట్టుకొచ్చేలానే కనిపిస్తోంది. ఇప్పటికే అనేక మంది చాంపియన్లు టోర్నీ నుంచి నిష్క్రమించగా.. తాజాగా మహిళల టెన్నిస్‌లో నెంబర్ వన్ ర్యాంకర్‌గా వెలుగొందుతున్న స్వియాటెక్ కూడా టోర్నీకి టాటా చెప్పేసింది. స్వియాటెక్  (పోలండ్) 2 4 తేడాతో పెగులా (అమెరికా) చేతిలో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. నంబర్ వన్ సీడ్ అయిన స్వియాటెక్ మీద ప్రపంచ ఆరో ర్యాంకర్ పెగులా అలవోకగా వరుస సెట్లలో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో ఏ దశలోనూ స్వియాటెక్ పెగులాకు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో పెగులా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మ్యాచ్ మొత్తం మీద ఒక్కటంటే ఒక్క ఏస్ కూడా సంధించని స్వియాటెక్ 41 అనవసర తప్పిదాలు చేసింది. రెండు డబుల్ ఫాల్ట్‌లు కూడా చేసిన ఈ మాజీ చాంపియన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ముచోవా (చెక్ రిపబ్లిక్) 6 6 తేడాతో హడ్డాడ్ (బ్రెజిల్) మీద సునాయస విజయం సాధించింది. ఈ మ్యాచ్  గంటన్నర లోపే పూర్తి కావడం గమ నార్హం. హడ్డాడ్ ముచోవాకు ఏ దశలో కూడా కనీస పోటీ ఇవ్వలేకపోయింది.

సిన్నర్ శ్రమించినా కానీ.. 

పురుషుల నంబర్ 1 ర్యాంకర్ అయిన సిన్నర్ (ఇటలీ) 6 1 6 6 తేడాతో ఐదో ర్యాంకర్ మెద్వెదేవ్ (రష్యా) మీద విజయం సాధించాడు. ఈ మ్యాచ్ హోరాహోరీగా 2.30 గంటలకు పైగా సాగింది. సిన్నర్‌కు మెద్వెదేవ్ గట్టిపోటీనిచ్చాడు. అయినా కానీ చివరకు గెలిచి సిన్నర్ ఊపిరి పీల్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సిన్నర్ నాలుగు ఏస్‌లు సంధించాడు. 57 అనవసర తప్పిదాలు చేసిన మెద్వెదేవ్ మూల్యం చెల్లించుకున్నాడు.

ఈ మ్యాచ్ 2.30 నిమిషాల సేపు సాగినా కానీ ఒక్క సెట్ కూడా టై బ్రేకర్‌కు వెళ్లలేదు. మరో క్వార్టర్ ఫైనల్లో డ్రాపర్ (యునైటెడ్ కింగ్‌డమ్) 6 7 6 తేడాతో మినౌర్ (ఆస్ట్రేలియా) మీద విజయం సాధించాడు. ఈ మ్యాచ్ కూడా 2 గంటలకు పైగా సాగింది. 

మహిళల డబుల్స్ ఎవరిదో?

మహిళల డబుల్స్ మ్యాచ్‌లో కిచెనోక్ జోడీ 6 6 తేడాతో చాన్ ద్వయం మీద గెలిచి ఫైనల్‌లో అడుగుపెట్టింది. మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో జాంగ్ జోడీ 7 4 6 తేడాతో సినియాకోవా ద్వయం మీద విజయం సాధించి ఫైనల్లో అడుగు పెట్టింది.

స్వియాటెక్ అసహనం

ప్రపంచ నంబర్ 1 ర్యాంకర్ స్వియాటెక్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆరో ర్యాంకర్ పెగులా చేతిలో వెనుకబడటాన్ని తట్టుకోలేకపోయింది. తన కోపం ఎవరి మీద చూపించాలో తెలియక రాకెట్‌తో నెట్ మీద తన ప్రతాపాన్ని చూపెట్టింది.