చలికాలంలో పెట్రోలియం జెల్లీ ఎక్కువగా వాడుతున్నారా? సమస్యలు తప్పవని అంటున్నారు నిపుణులు. చలికి చర్మం పగిలిపోవడం.. పోడిబారడం సహజం.. అయితే పెట్రోలియం జెల్లీ పడనివారికి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
* కొంతమంది చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అలాంటి వారు పెట్రోలియం జెల్లీ ఉపయోగిస్తే అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది.
* పెట్రోలియం జెల్లీని పూయడానికి ముందు చర్మాన్ని సరిగ్గా శుభ్రం చేయకపోతే ఫంగల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.
* ముఖ్యంగా పిల్లలలో ముక్కు చుట్టూ పెట్రోలియం జెల్లీ రాస్తే.. దాంట్లో ఉండే మినరల్ ఆయిల్స్ పీల్చడం వల్ల ఆస్పిరేషన్ న్యుమోనియా వచ్చే ప్రమాదం ఉంటుంది.
* కొంతమంది పెట్రోలియం జెల్లీని ఉపయోగిస్తే చర్మం పగిలే ప్రమాదం ఉంది. జెల్లీని అప్లు చేసే ముందు చర్మాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోవాలి.
* పెట్రోలియం జెల్లీని కొద్దిగా తీసుకొని చేతులు, కాళ్లు, పాదాలకు సన్నని పొరలాగా అప్లు చేసుకుంటే మంచిది.
* ముఖం పొడిబారి ఇబ్బందిగా అనిపిస్తే.. కొద్దిగా తడిగా ఉన్న చర్మంపై పెట్రోలియం జెల్లీని పూయడం వల్ల చర్మం తేమగా ఉంటుంది.
* అదే పనిగా పెట్రోలియం జెల్లీని ఉపయోగిస్తే.. చర్మంపై దుమ్ము, ధూళి చేరి ఒక పొరలాగ ఏర్పడుతుంది. వీలైనంత వరకు పెట్రోలియం జెల్లీని ఉపయోగించడం మానేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
* చర్మం పొడిబారకుండా ఉండేందుకు స్నానం చేసిన తర్వాత రోజుకు ఒకసారి పెట్రోలియం జెల్లీని అప్లు చేసుకుంటే సరిపోతుంది.