* ట్వంటీఫస్ట్ సెంచరీ అకాడమీ చైర్మన్ కృష ్ణప్రదీప్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 7(విజయక్రాంతి) : పట్టుదల, నిబద్ధతతో సివిల్స్ లక్ష్యాన్ని చేరొచ్చని ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఛైర్మన్ కృష్ణప్రదీప్ అన్నారు. శుక్రవారం వింగ్స్ మీడియా,జి5 మీడియా గ్రూప్, 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ సహకారంతో “మొదటి ప్రయత్నంలో సివిల్స్ సాధించడం ఎలా” అనే అంశంపై అల్వాల్‌లోని లయోలా అకాడమీలో ప్రత్యేక సెమినార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ బృందం రచించిన సివిల్ సర్వీసెస్ పుస్తకాలను లయోలా అకాడమీ ప్రిన్సిపాల్ ఫాదర్ డాక్టర్ ఎన్‌బీ బాబు ఎస్‌జే ఆవిష్కరించారు. ఈ సదస్సులో అకాడమీ డైరెక్టర్, చీఫ్ మెంటర్ డాక్టర్ భవానీ శంకర్, విద్యార్థి వ్యవహారాల డీన్ సరశ్చంద్ర, డాక్టర్ పి.సా యి మమత, భారతి, అధ్యాపకులు డాక్టర్ భవానీ, డాక్టర్ షఫీక్ అహ్మద్ పాల్గొన్నారు.