14-03-2025 12:00:00 AM
మహబూబాబాద్. మార్చి13 (విజయ క్రాంతి): క్రమశిక్షణ, కఠిన సాధన, పట్టుదల ఉంటే ఏ లక్ష్యమైనా సాధించవచ్చనిజిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ అన్నారు.గ్రూప్-2 పరీక్షలో ప్రతిభ చూపించి 25వ ర్యాంక్ సాధించిన ఎస్.ఐ. శివను జిల్లా పోలీస్ అధికారి సుధీర్ రాంనాధ్ కేకన్ అభినందించి ప్రత్యేకంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రమశిక్షణ, కఠిన సాధ న, పట్టుదల ఉంటే ఏ లక్ష్యమైనా సాధించవచ్చని తెలిపారు. మహబూబాబాద్ టౌన్ ఎస్త్స్ర శివ తన విధులను నిర్వహిస్తూ చదువుపై ఆసక్తి కనబరచి ఉన్నత ర్యాంక్ సాధిం చడం ఇతర పోలీస్ అధికారులకు ప్రేరణగా నిలుస్తుందని ఎస్పీ ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ డిఎస్పీ శ్రీనివాస్, ఐటీ సె ల్ ఇన్స్పెక్టర్ నరేందర్, ఎస్.బి ఇన్స్పెక్టర్ చం ద్రమౌళి, డీసీఆర్బి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, టౌన్ సీఐ దేవేందర్, ఆర్.ఐలు నాగే శ్వర్రావు, అనిల్, పాల్గొన్నారు.