ఒంటికి నిప్పంటించుకొని వ్యక్తి బలవన్మరణం
రాజేంద్రనగర్, జనవరి 2: ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చే దారిలేక ఓ వ్యక్తి నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతుడి కు టుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం మల్లికార్జున్.. బంధువులు, తెలిసిన వారివద్ద అప్పులు చేసి ఇటీవల లంగర్‌హౌస్‌లో నూతనంగా ఇల్లు నిర్మించుకున్నాడు.
అయితే చేసిన అప్పులు ఎక్కువైపోవడం, తిరిగిచ్చే సమయం ఆసన్మమవడంతో మరోచోట నుంచి డబ్బు ముట్టే అవకాశం లేకపోవడంతో మానసిక క్షోభకు గురైన మల్లికార్జున్ గురువారం సాయంత్రం గండిపేటలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. స్థానికులు మంటలను ఆర్పి అతడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. నార్సింగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.