calender_icon.png 7 March, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాన్నకు ప్రేమతో..

26-01-2025 12:23:24 AM

కరీంనగర్, జనవరి 25 (విజయక్రాంతి): రేకుర్తి 18వ డివిజన్ కార్పొరేటర్ సుధగోని మాధవీకృష్ణగౌడ్ ఆయన తండ్రి నుధగోని నర్సయ్యగౌడ్, సోదరుడు సుదగోని శ్రీనివాస్ గౌడ్, నాగపురి మల్లేశంగౌడ్, ఎల్లయ్యల జ్ఞాపకార్ధం కాళోజీనగర్ స్వాగత తోరణాన్ని నిర్మించారు.

ఈ తోరణాన్ని కార్పొరేటర్ కలిసి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. 18, 19వ డివిజన్లను కలుపుకొని ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్లే ఘాట్ రోడ్ను ఎమ్మెల్యే ఇదేరోజు ప్రారంభించారు.

అంతకుముందు 16వ డివిజన్లో మున్నూరు కాపు సంక్షేమ సంఘం భవనం, సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు ఏదుల్ల రాజశేఖర్, భూమాగౌడ్, దిండిగాల మహేష్, జయశ్రీలు పాల్గొన్నారు.