calender_icon.png 29 October, 2024 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10 ప్రేమకథలతో..

29-10-2024 12:03:52 AM

యూత్ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ కథా కథనాలతో రాబోతోంది ‘యో! 10 ప్రేమకథలు’. దర్శకుడు, రచయిత మనోహర్ చిమ్మని దర్శకత్వంలో పీసీ క్రియేషన్స్ సమర్పణ లో మనూటైమ్ మూవీ మిషన్ సంస్థ నిర్మిస్తోంది. 10 మంది పాపులర్ హీరోహీరోయిన్లు నటించనున్న ఈ సినిమా సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రారం భోత్సవంలో ప్రముఖ దర్శకులు వీరశంకర్, చంద్రమహేశ్ ముఖ్య అతిథులుగా, డైరెక్టర్లు బాబ్జీ, ప్రియదర్శిని అతిథులుగా పాల్గొన్నారు.  షూటింగ్ నవంబర్ చివరి వారం నుంచి ప్రారంభిస్తున్నామని చిత్ర దర్శకుడు మనోహర్ తెలిపారు. మిగతా వివరాలన్నీ తర్వాత ప్రకటిస్తామని చెప్పారు.