- కేంద్రమంత్రి కుమారస్వామిపై జాత్యాహంకార వ్యాఖ్యలు
- వివాదంలో కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్
బెంగళూరు, నవంబర్ 11: కేంద్రమంత్రి, కుమారస్వామిపై కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ నేత జమీర్ అహ్మద్‌ఖాన్ చేసిన జాత్యాంహంకార వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. ఆయన వ్యాఖ్యలను కేంద్రంలోని ఎన్డీయే నేతలు తీవ్రంగా ఖండించారు. ఇటీవల బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్‌లో చేరిన ఓ నేతను ఉద్దేశించి జమీర్ మాట్లాడుతూ..‘ పార్టీలో అభిప్రాయబేధాల కారణంగా చెన్నపట్నం అసెంబ్లీ ఉపఎన్నికలో స్వతంత్ర సభ్యుడిగా యోగీశ్వర పోటీలో నిలిచారు.
తర్వాత వేరే దారిలేక బీజేపీలో చేరారు. అయితే బీజేపీ కంటే కుమారస్వామి (కాలియా) ప్రమాదకరమని తెలుసుకొని తిరిగి సొంతగూటికి(కాంగ్రెస్) చేరుకున్నారు’ అని పేర్కొన్నారు. కాగా చెన్నపట్నం ఉపఎన్నికలో కుమారస్వామి తనయుడు నిఖిల్ బరిలో ఉన్నారు.
బీజేపీ కూటమి తరఫున ఆయనకు టికెట్ దక్కింది. జమీర్ వ్యాఖ్యలపై బీజేపీ, జేడీఎస్ తీవ్రంగా స్పందిం చాయి. ‘ఇలా ఎదుటివారి రంగును ఉద్దేశించి నీచంగా మాట్లాడే మనస్తత్వం ఉన్నవా రిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి’ అని డిమాండ్ చేశాయి.