calender_icon.png 27 December, 2024 | 12:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హారర్ కామెడీతో..

05-12-2024 12:00:00 AM

బాలీవుడ్ భామ ఆలియా భట్ టైం నడవటం కాదు.. పరుగులు పెడుతోంది. నటించిన సినిమాలన్నీ మంచి సక్సెస్ సాధిస్తుండటంతో మేకర్స్ తొలి ఎంపికగా ఆలియా మారిపోయారు. ఏ పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోయే నైపుణ్యం ఆమెను స్టార్‌ని చేసింది. ‘గంగూభాయి కతియావాడి’ చిత్రంతో జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. పాత్ర ఏదైనా జీవించేస్తారు. తాజాగా ఈ భామ హారర్ కామెడి థ్రిల్లర్ జానర్‌లో నటించనున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

ఇప్పటి వరకూ ఆలియా ఈ జానర్‌లో నటించలేదు. నిర్మాత దినేశ్ ‘ఛముండా’ అనే పేరుతో ఒక సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాలో ఆలయా భట్ కథానాయికగా నటించనున్నా రట. ఇప్పటికే మేకర్స్ ఆమెతో కథ గురించి చర్చించారట. ఆలియా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ప్రస్తుతం ఆలియా తన భర్త రణబీర్ కపూర్‌తో కలిసి ‘లవ్ అండ్ వార్’ చిత్రంలో నటిస్తున్నారు.